ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం

3చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం
పెదవేగి మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో వంగూరుకు చెందిన చొదిమెళ్ల ఏసు (20) అనే యువకుడు మృతి చెందాడు. జానంపేట నుంచి సొంతూరికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్