
తణుకు: డబ్బులు దోచుకున్న ఘటనపై కేసు నమోదు
తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లోని ఏటీఎం సెంటర్లో ఈ నెల 9న సుబ్బారావు అనే వ్యక్తి వద్ద ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చి రూ. 23,400 నగదును అపహరించిన ఘటనపై పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.







































