రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

8చూసినవారు
రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కామవరం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన కోలా శివప్రసాద్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు బైక్‌పై వెళుతుండగా నిద్ర మత్తులో హైవేపై రెయిలింగ్‌ను ఢీకొనడంతో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్