పెనుగొండలో వాసవి శాంతి ధామ్ ను దర్శించిన ప్రవాసాంధ్రులు

5చూసినవారు
పెనుగొండలో వాసవి శాంతి ధామ్ ను దర్శించిన ప్రవాసాంధ్రులు
పెనుగొండలో కొలువుతీరిన శ్రీ వాసవి శాంతి ధామ్ ను అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఆకాశపు రమేష్, మాధవి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. గణపతి పూజ, అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ తరఫున కమిటీ సభ్యులు రమేష్, మాధవి దంపతులను ఘనంగా సత్కరించారు. అమ్మవారు పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని దంపతులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్