
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు.. మే 6కు వాయిదా
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను మే 6కు కోర్టు వాయిదా వేసింది. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కస్టడీ పిటిషన్ను కాకినాడ మొబైల్ కోర్టులోనే వేయాలని కోర్టు సూచించింది. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలని అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు.




