అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో శనివారం రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి రూ. 3 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.