తణుకులోని గౌతమి సాల్వెంట్స్ సమీపంలో గురువారం కాటన్ లోడుతో వెళుతున్న లారీ అగ్నిప్రమాదానికి గురైంది. కర్మాగారంలోకి వెళ్లి బయటకు వచ్చిన సమయంలో లారీలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.