తణుకులో క్రాస్ కంట్రీ ఎంపికలు: 22 మంది రాష్ట్ర స్థాయికి

602చూసినవారు
తణుకులో క్రాస్ కంట్రీ ఎంపికలు: 22 మంది రాష్ట్ర స్థాయికి
జిల్లాస్థాయిలో అండర్ 16, 18, 20 బాలురు, బాలికలు, పురుషులు, మహిళల క్రాస్ కంట్రీ జట్ల ఎంపికలు సోమవారం తణుకులో జరిగాయి. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది క్రీడాకారులు పాల్గొనగా, 22 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 24న పెద్దాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.