బాల్య వివాహాలపై బాలికలకు అవగాహన కల్పించిన ఐసిడిఎస్

443చూసినవారు
బాల్య వివాహాలపై బాలికలకు అవగాహన కల్పించిన ఐసిడిఎస్
బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా తణుకు మండలం పైడిపర్రు జడ్పీ హైస్కూలులో సోమవారం కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ పి.మహాలక్ష్మి ఆధ్వర్యంలో బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు వంటి అంశాలపై వారికి వివరించారు. అనంతరం మానవహారం చేపట్టి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం ఏడుకొండలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.