ఇరగవరం: లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష

2చూసినవారు
ఇరగవరం: లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష
ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన మంత్రి రాజేష్ అలియాస్ బాబి, అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2023లో నమోదైన ఈ కేసులో, బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో కోర్టు జడ్జి లక్ష్మీనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తులో నిందితుడికి జైలు శిక్ష విధించినట్లు ఇరగవరం ఎస్సై జానా సతీష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్