రేషన్ దుకాణంలో జేసీ ఆకస్మిక తనిఖీ: లబ్ధిదారులతో మాట్లాడిన అధికారులు

13చూసినవారు
రేషన్ దుకాణంలో జేసీ ఆకస్మిక తనిఖీ: లబ్ధిదారులతో మాట్లాడిన అధికారులు
బుధవారం నాడు తణుకులోని అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో 33వ నెంబరు రేషన్ దుకాణాన్ని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ మిషన్ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతి నెలా లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ డీలర్లు ఈ-పోస్ మిషన్ ద్వారానే ప్రజా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్