
లిక్కర్ స్కామ్: ముగ్గురు నిందితులకు ఊరట
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. వారిని అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 24వ తేదీ వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 6వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది.




