తణుకు నియోజకవర్గంలో యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆయన స్వర్గీయ నందమూరి తారకరామారావు స్మారక
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' నినాదంతో తణుకులో ఏర్పాటుచేసిన
ఎన్టీఆర్ స్మారక
క్రికెట్ టోర్నమెంట్ మూడో ఎడిషన్ ప్రారంభించడం అభినందనీయమని ఆయన అన్నారు.