మాణిక్యాలరావు విగ్రహానికి ముళ్ళపూడి కృష్ణారావు ఘన నివాళి

155చూసినవారు
మాణిక్యాలరావు విగ్రహానికి ముళ్ళపూడి కృష్ణారావు ఘన నివాళి
తాడేపల్లిగూడెం ఎస్విఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దివంగత దేవాదాయమంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి కృష్ణారావు సందర్శించి, నివాళులర్పించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మాణిక్యాలరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు కూడా ముళ్ళపూడి కృష్ణారావుతో కలిసి, ఆయన నిరాడంబరతతో చేసిన సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్