ఈనెల 13న తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు జిల్లా జడ్జ్ డి.సత్యవతి తెలిపారు. బుధవారం తణుకు కోర్టు పరిధిలోని పోలీసు అధికారులు, న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, వీలైనన్ని ఎక్కువ కేసులను రాజీ ద్వారా పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు కృష్ణసత్యలత, సాయిరాం పోతర్లంక, కృష్ణవేణి, తాడి ఆంజనేయులు పాల్గొన్నారు.