ఏపీ కూటమి ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చాలని నిర్ణయించింది. ఈ పేరుమార్పు కోసం జీవో త్వరలో విడుదల కానుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఆర్యవైశ్య సంఘ నేతలు కలిసి విజ్ఞప్తి చేయగా, వారి కోరికను ప్రభుత్వం ఆమోదించింది. కన్యకా పరమేశ్వరి జన్మస్థలమైన ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.