పెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజుల ఉద్యోగం కోసం దుబాయ్ చేరినా, అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతం ఇవ్వకపోడంతో పాటు ప్రతిరోజూ హింసకు గురవుతున్నట్టు ఆమె చెప్పింది. తన పరిస్థితిని వెల్లడిస్తూ పంపిన సెల్ఫీ వీడియో కుటుంబసభ్యులను కలచివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనుండి బయటపడేందుకు అధికారులు సహాయం చేసుకొని తాను స్వదేశానికి చేరేలా చూడాలని మంజుల విజ్ఞప్తి చేస్తున్నారు.