ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వేదిక నిర్వహించారు. మండల ప్రజలు తమ అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.