తణుకు సబ్ జైల్ రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కే కృష్ణవేణి బుధవారం జైలును సందర్శించారు. రిమాండ్ ఖైదీలకు ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని, చేసిన తప్పులను సరిదిద్దుకొని గౌరవంగా జీవించాలని ఆమె కోరారు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.