తణుకు: స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

2చూసినవారు
తణుకు: స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా, సీఎం చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, ప్రతి మూడో శనివారం పారిశుద్ధ్యం పెంపొందించే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్