తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర రాజసహిత శ్రీ యల్లారమ్మ వారి వార్షిక ఉత్సవాలు మరియు తీర్థం సందర్భంగా శనివారం ఉదయం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.