తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూరుకు చెందిన అందే వెంకటలక్ష్మి (48) మృతి చెందారు. ఆమె భర్త లోకేశ్వరరావుతో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మరణించగా, గాయపడిన లోకేశ్వరరావును తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.