కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ప్రజా ఉద్యమం పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీపీ విధానం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం దూరం అవుతుందని ఆరోపించారు.