పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనదారులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.