తణుకులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

12చూసినవారు
తణుకులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్