
త్రిభాషా నిఘంటువులు విద్యార్థుల భాషాభివృద్ధికి దోహదం
ఆచంట మండలంలోని పెదమల్లం UP పాఠశాల విద్యార్థులకు STU మండల శాఖ గురువారం త్రిభాషా నిఘంటువులను అందజేసింది. ఈ నిఘంటువులు విద్యార్థుల్లో భాషాభివృద్ధికి దోహదపడతాయని ఆచంట MEOలు సి.హెచ్. శ్రీనివాస్, పి. రాజేంద్రప్రసాద్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో STU మండల శాఖ అధ్యక్షులు ముత్తాబత్తుల త్రిమూర్తులు, కోశాధికారి ఫణి కుమార్, పాఠశాల హెచ్.ఎం శ్రీమతి భార్గవి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.





































