ఆకివీడు మండలంలో 900 ఎకరాలు పంట నష్టం

6చూసినవారు
ఆకివీడు మండలంలో 900 ఎకరాలు పంట నష్టం
మొంథా తుఫాను ప్రభావంతో ఆకివీడు మండలంలో పంట నష్టం అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మాదివాడ, గుమ్ములూరు, రాజుల పేట, చినమిల్లిపాడు ప్రాంతాల్లో రెవిన్యూ, వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించారు. మొత్తం 690 మంది రైతులకు సంబంధించి సుమారు 900 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తించారు. నష్టం వివరాల తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్