ఆకివీడులోని మెడికల్ షాపు యజమాని శంకర్ వద్ద వందేళ్ల నాటి స్విట్జర్లాండ్లో తయారైన గడియారం ఉంది. ఇది తమ తాతల కాలం నుంచీ తమ వద్దే ఉందని, ప్రతిరోజూ 'కీ' ఇస్తే ఇప్పటికీ పనిచేస్తుందని, చిన్నపాటి మరమ్మతులు కూడా రాలేదని ఆయన తెలిపారు. ఈ అరుదైన గడియారం అందరినీ ఆకట్టుకుంటోంది.