ఆకివీడు మండలంలోని కళింగ గూడెం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ₹. 27. 80 లక్షలతో రాజుల పేటలో, ₹. 29. 94 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన "రైతు సేవా కేంద్రం" భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.