
ఆటోమేటిక్ కారు బీభత్సం.. పలువురికి గాయాలు (వీడియో)
కర్ణాటకలోని ఉడుపిలో ఒక ఆటోమేటిక్ కారు బీభత్సం సృష్టించింది. కారు డోర్ సరిగ్గా మూయకపోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి అదుపులేకుండా వెనక్కి, ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న పలువురు గాయపడ్డారు. డ్రైవర్ బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ మధ్య గందరగోళానికి గురవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.




