కల నెరవేర్చిన కలెక్టర్.. సెకెండ్ గ్రేడ్ లో రూత్ ఉత్తీర్ణత

5చూసినవారు
కల నెరవేర్చిన కలెక్టర్..  సెకెండ్ గ్రేడ్ లో రూత్ ఉత్తీర్ణత
కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లేకపోయినా, కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో ఉపాధ్యాయుల చొరవతో కండ్రు రూత్ అనే బాలిక పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. తలమ్మ చెరువునకు చెందిన ఆమెను కుటుంబ తగాదాలతో తండ్రి పాఠశాలకు పంపలేదు. అయినా రూత్ ఉత్తీర్ణత సాధిస్తుందని జనవరి 24న ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు స్పందించి రూత్ జువ్వలపాలెంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అక్కడి ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరై పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆమె సెకెండ్ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించి తన కలను నెరవేర్చుకుంది.