
కొద్దిసేపట్లో పెళ్లి.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి!
TG: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామం సమీపంలో బుధవారం పెట్రోల్ పంప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో సహా 8 మంది ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది బంధువులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకకు కొద్దిసేపటి ముందు జరిగిన ఈ ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.




