ఆకివీడులో అగ్నిప్రమాదం

4చూసినవారు
ఆకివీడులో అగ్నిప్రమాదం
ఆకివీడు మాదివాడ ప్రాంతంలో మంగళవారం ఏలూరు శ్రీనివాసరావుకు చెందిన సుమారు నాలుగు ఎకరాల ఎండుగడ్డి అగ్నికి ఆహుతైంది. గాలిబ్ చెరువు సమీపాన జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్