ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మార్చురీ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, దాతలు, డాక్టర్లు, కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్జ్, జనసేన నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.