అన్యాయం జరుగుతుందంటూ సెల్ టవర్ ఎక్కిన నాయకుడు
ఉండి నియోజకవర్గంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ శనివారం ఆకివీడులో ఒక దళిత నాయకుడు సెల్ టవర్ ఎక్కారు. చర్చిలను కూల్చివేయడం, దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన సెల్ టవర్ పైనుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
