ఆకివీడులో శనివారం తెల్లవారుజాము నుంచి సన్నపాటి చినుకులు ప్రారంభమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వీస్తున్న చల్లటి గాలులకు తోడు ఈ చిరుజల్లులు కురవడంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వాతావరణ మార్పుతో అవస్థలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.