
భార్య ఖర్చుల వివరాలు అడగడం క్రూరత్వం కాదు: సుప్రీం కోర్టు
భార్యకు ఇచ్చిన నగదు ఖర్చుల లెక్కలు అడగడం మానసిక క్రూరత్వం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వివాహ జీవితంలో ఆర్థిక విషయాల్లో పారదర్శకత కోరడం భర్త హక్కు అని పేర్కొంది. సరూర్నగర్ కేసులో భార్య వరకట్న వేధింపుల ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ, ఖర్చులపై ప్రశ్నించడం సాధారణ తగాదా మాత్రమేనని తీర్పు చెప్పింది. భర్త తన ఆదాయంలో భాగాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడం అతని వ్యక్తిగత నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది.




