
ఇరాన్ వద్ద 11 బాంబులకు సరిపడా యురేనియం: అమెరికా ప్రతినిధి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ వద్ద 11 అణు బాంబులను తయారు చేయడానికి సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇరాన్ అధికారులు తమ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం ఉందని, 10 రోజుల్లో అణ్వాయుధాలను తయారు చేయగలమని గర్వంగా ప్రకటించారని ఆయన తెలిపారు. అయితే, అమెరికా దాడుల వల్ల ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కావడంతో, తక్షణమే బాంబులు తయారు చేసే అవకాశం కోల్పోయిందని విట్కాఫ్ పేర్కొన్నారు.




