నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి తాను సూచించిన స్థలమే భీమవరానికి దగ్గరగా ఉండి అనువుగా ఉంటుందని
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి మండలంలోని పెదమిరంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని భీమవరంలో కలపాలని కూడా సూచించారు. అయితే కలెక్టరేట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు అఖిలపక్షం ఏర్పాటు చేయడం అనవసరమని, ఈ విషయంపై రాద్దాంతం చేయవద్దని హితవు పలికారు.