
నిశ్శబ్దం కూడా శక్తివంతమే.. నేడే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే
ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేవారే శక్తివంతులనే భావనను పటాపంచలు చేస్తూ, నిశ్శబ్దంగా ఉండే మనసులు కూడా ప్రపంచాన్ని మార్చగలవని గుర్తుచేసే రోజే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే. ప్రతి సంవత్సరం జనవరి 2న దీనిని జరుపుకుంటారు. ఇంట్రోవర్ట్ అంటే ఒంటరిగా, చిన్న గ్రూప్లో ఉండటాన్ని ఇష్టపడేవారు, వీరు ప్రశాంతతలో ఆలోచించి లోతైన విషయాలను గ్రహిస్తారు. ఇది బలహీనత కాదు, ఒక బలం. చరిత్రలో ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ వంటి ఎంతోమంది గొప్పవారు ఇంట్రోవర్టులే. ఆధునిక కాలంలో బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, ఎలీనర్ రూజ్వెల్ట్ వంటివారు కూడా తమ ప్రశాంతతతోనే ప్రపంచాన్ని ప్రభావితం చేశారు.




