కాళ్ల మండలం సీసలి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఆదివారం శాకాంబరీ అలంకరణ ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఆలయాన్ని పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో అందంగా అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. సాయిబాబా విగ్రహానికి వివిధ రకాల కూరగాయలతో శోభాయమానమైన అలంకరణ చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దర్శనం చేసుకున్నారు.