కాళ్లకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు: భక్తిశ్రద్ధలతో వేడుకలు

1037చూసినవారు
కాళ్లకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు: భక్తిశ్రద్ధలతో వేడుకలు
కాళ్లకూరులోని స్వయంభూః శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో ఐదవ రోజు బుధవారం ఉదయం నిత్యోపాసన, పంచసూక్తహనం, సహస్ర లిల్లీ పుష్పార్చన, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం పల్లకి వాహనంపై నిర్వహించారు. రాత్రి శ్రీదేవి బుర్రకథ దళం వారిచే సీతా కళ్యాణం బుర్రకథ ప్రదర్శన జరిగింది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు హాజరయ్యారు.