
పలు దేశాలకు విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఎయిర్ ఇండియా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమన్ దేశాలకు తన విమాన సేవలను తక్షణమే రద్దు చేసింది. అబుదాబి, దుబాయ్, దమ్మామ్, జెడ్డా, రియాద్, దోహా, మస్కట్ నగరాలకు విమానాలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు కూడా సేవలు రద్దు చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.




