కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభూ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. వివిధ మేళతాలాల నడుమ గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. గులాబీ పుష్పాలతో విశేషార్చన చేశారు. ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఆలయ చైర్మన్ అడ్డాల నాగరాజు, ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. కాళ్లకూరు శ్రీ వెంకన్నబాబు కళ్యాణం కనుల పండువగా సాగింది.