పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరులో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, పూరిళ్లు కావడంతో లోపల ఉన్న సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.