గురువారం ఉండి మండలం పెదపులేరు గ్రామంలోని వెస్ట్ ఫీల్డ్ స్కూల్ బస్సు బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం, బస్సులో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.