
మంత్రి దృష్టికి ఉంగుటూరు ఏఎంసీ సమస్యలు
ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మంగళవారం ఉంగుటూరు AMC చైర్మన్ సూరత్తుల జ్యోతి అయ్యప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. మార్కెట్ యార్డ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వసతుల కల్పన ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు వివరించారు.




































