భీమడోలు గ్రామంలోని 103 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామ మందిరం పునర్నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.