భీమడోలు రైతు సేవా సహకార సంఘంలో చైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. పాడీ ప్రొక్యూర్మెంట్ ద్వారా వచ్చిన సుమారు ₹. 3.11 లక్షలను డిసిసిబి బ్యాంకులోని ఇన్ బాలెన్స్ లకు జమ చేయాలని నిర్ణయించారు. డిపాజిట్ల సేకరణకు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. రైతు నేస్తం రుణం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు రుణాలను బోర్డు ఆమోదించింది.