ద్వారకాతిరుమల: బస్సు నుండి జారిపడిన మహిళ

9చూసినవారు
ద్వారకాతిరుమలలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదలైంది. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన వృద్ధురాలు కొణతం వీరమ్మ, శ్రీవారి దర్శనానంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు గుడి సెంటర్లో ఏలూరు డిపో ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీ ఎక్కువ కావడంతో తోపులాట జరిగి, బస్సులోంచి జారి పడిపోయింది. బస్సు వెనుక చక్రాలు ఆమె ఎడమ కాలి మీద నుంచి వెళ్లిపోవడంతో, కాలు నుజ్జునుజ్జు అయ్యింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you